ఇప్పటికే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో దిమ్మ తిరిగే షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేశారు. జమ్ము కాశ్మీర్ కు చెందిన అగ్రనేత గులాం నబీ ఆజాద్ కాసేపటి క్రితమే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా ఎదిగిన గులాం నబీ ఆజాద్.. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు.. ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ సీనియర్ల అందరినీ పక్కన పెట్టేశారని తన రాజీనామా సందర్భంగా గులాం నబీ అజాద్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి రాజకీయ పరి పక్వత లేదని విమర్శలు చేశారు. రాహు ల్ వైస్ ప్రెసి డెంట్ అయ్యాక.. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అయిందని ధ్వజమెత్తారు. కాగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో.. గులాం నబీ ఆజాద్… రాజీనామా మాత్రం కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ అని చెప్పాల్సి ఉంటుంది.