»France Is Burning All The Black Nationals Are United
France riots: ఫ్రాన్స్ అంతా తగలబడిపోతోంది..నల్ల జాతీయులంతా ఏకం అయ్యారు!
ఫ్రాన్స్ లోని ప్యారిస్ అంతా ఆందోళనకారులతో హోరెత్తిపోతోంది. నిరసనకారుల ఆవేశానికి నగరంలోని షాపింగ్ మాల్స్, వాహనాలు దగ్ధం కాగా, 1300 పైగా అరెస్టులు చేసినా అల్లర్లు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
France is burning... all the black nationals are united..
France: ప్యారిస్(paris) అంతా అట్టుడికిపోతోంది. విధ్వంసకారులు దేశసంపదను తగలబెడుతున్నారు. మంగళవారం ఓ మైనర్ బాలుడు పోలీసుల చేతులో హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే అతను మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల కుర్రాడు. నల్లజాతీయుడైన నాహెల్‌ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపటంతో మొదలైన అల్లర్లు ఇప్పుడు ప్యారిస్ నగరం అంతా అలుముకున్నాయి. ఎంత మంది పోలీసులు మోహరించినా ఆందోళనకారులు ఇంకా రెచ్చిపోతున్నారు. రాత్రి అయితే చాలు వేల మంది యువకులు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ప్రభుత్వ వాహనాలను, ప్రైయివేటు వాహనాలను తగలబెడుతున్నారు. నగరం అంతా గందరగోళపరిస్థితి నెలకొంది. ఇప్పటికే నగరంలో 2500 పైగా వాహనాలకు నిప్పుపెట్టారు. నగరంలో షాపింగ్ మాల్స్ లను
ధ్వంసం చేశారు. నిరసనకారులపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేపడుతున్నారు. ఇప్పటి వరకు 1300 పైగా అరెస్టులు అయినా అలర్లు తగ్గడం లేదు. అయితే ఈ ఆందోళనలో పాల్గొంటున్న వారంతా యువకులని, ఫ్రాన్స్ లో శాంతిభద్రతలను కాపాడెందుకు పోలీసులు అప్రమత్తంగానే ఉన్పప్పటికీ యువకులు మాట వినటం లేదని పోలీసులు చెప్తున్నారు. దేశంలో శాంతిని నెలకొల్పేందుకు అందరు కృషి చేయాలని దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్(Emmanuel Macron) సైతం పిలుపునిచ్చారు. అయినా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే ఈ అల్లర్ల వెనుక బలమైన కారణమే ఉందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ప్యారిస్(paris)లో యువకులు ఇంత రెచ్చిపోవడానికి కారణం నాహెల్ అనే యువకుడు నల్లజాతీయుడు కావడమే కారణం అని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపిన తర్వాత ఇదే తరహా అల్లర్లు చెలరేగాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లో చనిపోయిన నాహెల్ కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చిన అరబ్ మూలాలున్న నల్లజాతీయుడే అని తెలుస్తోంది. అతడు ముస్లిం మతానికి చెందిన యువకుడు. దీంతో ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులంతా తీవ్ర ఆగ్రహంతో నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు జాతి వివక్షపై తిరుగుబాటు అని ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామం కచ్చితంగా దేశా భవిష్యత్తుకు మంచిది కాదనేది నిపుణుల అంచనా. సోషల్‌మీడియా వేదికగా ఈ వివాదం జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. నాహెల్ తల్లి కూడా తన కుమారుడు నల్లజాతీయుడు కాబట్టే పోలీసులు కాల్చిచంపారని ఆరోపించాడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపిరి పోసినట్లైందని నిపుణులు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆందోళనకారులను శాంతింపచేస్తే తప్ప ఈ ఉద్యమం ఇప్పట్లో ఆగేలా లేదు.