సెక్స్‌కి బాలికలకు వయస్సు 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ( Madhya PradeshHigh Court ) గ్వాలియర్ ధర్మాసనం అభిప్రాయపడింది. తద్వారా టీనేజ్ (teenage) బాలురను చట్టపరమైన చర్యల నుంచి కాపాడవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 2020లో ఒక బాలికను పదేపదే మానభంగం చేసి, గర్భవతిని చేశాడంటూ ఒక యువకునిపై దాఖలైన ఎఫ్ఐఆర్(FIR)ను హైకోర్టు జూన్ 27న కొట్టివేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి ఈ సూచన పంపింది.
ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ (Internet) వల్ల బాలబాలికలకు 14 ఏళ్ల వయసులోనే పెద్దరికం వస్తోందనీ, బాలికలు 14 ఏళ్లకే యవ్వన దశకు చేరుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి దీపక్ కుమార్ అగర్వాల్ (Deepak Kumar Aggarwal)తెలిపారు. టీనేజ్లోనే బాలబాలికలు పరస్పర శారీరక ఆకర్షణలకు లోనవుతున్నారని పేర్కోన్నారు. అయితే, విచారణలో సదరు బాలికకు సన్నిహిత బంధువుతోనూ శారీరక సంబంధం ఉన్నట్లు తేలిందని హైకోర్టు వెల్లడించింది. దీంతో ఈ కేసును కొట్టేస్తున్నట్లు పేర్కొంది. విచారణలో భాగంగా ధర్మాసనం శృంగారానికి సమ్మతి వయసుపై కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ శిక్షాస్మృతికి సవరణ చేయకముందు ఉమెన్ కన్సెంట్ ఏజ్ 16 ఏళ్లుగానే ఉండేదని ధర్మాసనం గుర్తుచేసింది.