NDL: పాణ్యం మండలం బలపనూరు గ్రామ సమీపంలో ఇవాళ జాతీయ రహదారిపై తెల్లవారుజామున మహారాష్ట్రకు చెందిన స్కార్పియో వాహనం అతివేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.