MLC Kavita Arrest: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారు. ఈ సమాచారంతో బీఆర్ఎస్ నేతలు కవిత ఇంటివద్దకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ నెలకొంది. దాదాపు ఐదు గంటల పాటు ఈడీ అధికారులు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించారు.సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించారు. కవిత లీగల్ టీమ్‌ను కూడా అననుమతించలేదు.
కవిత అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికల వేళ కుట్రపూరితంగానే కవితను అరెస్టు చేశారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంద అధికారులు బృందం మొత్తం నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాలతో పాటు ఐటీ సోదాలు కూడా నిర్వహించారు.