NGKL: కోడేరు మండలంలోని పసుపుల గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి భరత్ (35) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం పెద్దకొత్తపల్లికి చెందిన భరత్ తన స్నేహితుడు అంజితో బైక్పై ప్రయాణిస్తుండగా కోడేర్ మండలంలోని పసుపులలో బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో భరత్ తలకు తీవ్ర గాయాల కారణంగా అక్కడికక్కడే మృతిచెందాడు.