Dream11 CEO: రూ.4 కోట్లు… మూడు రెట్లు పెరిగిన డ్రీమ్ 11 సీఈవో వేతనం
పాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ (fantasy gaming platform) డ్రీమ్ 11 (Dream11) ఇటీవల 225 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజింగ్ రౌండ్ ను (fundraising round) ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.1650 కోట్లు. ఈ ఫండ్ రెయిజింగ్ ప్రకటన తర్వాత డ్రీమ్ 11 సీఈవో (Dream11 CEO) హర్ష్ జైన్ (Dream11 CEO Harsh Jain) వేతనం 3.3 రెట్లు పెరిగింది.
పాంటసీ గేమింగ్ ప్లాట్ ఫామ్ (fantasy gaming platform) డ్రీమ్ 11 (Dream11) ఇటీవల 225 మిలియన్ డాలర్ల ఫండ్ రెయిజింగ్ రౌండ్ ను (fundraising round) ప్రకటించింది. ఇది మన కరెన్సీలో రూ.1650 కోట్లు. ఈ ఫండ్ రెయిజింగ్ ప్రకటన తర్వాత డ్రీమ్ 11 సీఈవో (Dream11 CEO) హర్ష్ జైన్ (Dream11 CEO Harsh Jain) వేతనం 3.3 రెట్లు పెరిగింది. ఈ స్టార్టప్… జైన్ వేతనాన్ని వార్షిక ప్రాతిపదికన రూ.1.2 కోట్ల నుండి రూ.4 కోట్లకు పెంచింది. డ్రీమ్ 11 నిర్వాహకుల వేతనం 2017-18 ఆర్థిక సంవత్సరం నుండి 68 రెట్లు పెరిగింది. FY2018లో 62.6 లక్షలుగా ఉన్న వేతనం FY19 నాటికి రూ.42.6 కోట్లకు చేరుకున్నది.
డ్రీమ్ 11 ఆపరేటివ్ ఇండియన్ ఎంటిటీ స్పోర్టా టెక్నాలజీస్ రెమ్యునరేషన్ ను ప్రతి సంవత్సరం పెంచుతోంది. FY20కి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ వివరాలు తెలియవలసి ఉంది. ఈ స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రారంభ సంవత్సరాల్లో నిధుల కొరత కారణంగా డబ్బులను పొందలేకపోయారు. ఇప్పుడు రాబడి, వ్యాల్యుయేషన్ పెరగడంతో అధిక వేతనాలు పొందుతున్నారు. మెజార్టీ యూనికార్న్స్, గ్రోత్ స్టేజ్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు మంచి వేతనం కలిగి ఉన్నప్పటికీ, చాలా కొద్ది మంది మాత్రమే జైన్ వంటి వేతనం, ప్రోత్సాహకాలను పొందుతారు. ఇప్పటి వరకు పేటిఎం విజయ్ శేఖర్ శర్మ, క్వికర్ ప్రణయ్ చులెట్ మాత్రమే అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలుగా ఉన్నారు.
FY19లో వెహికిల్, ఇంధనం, డ్రైవర్, మొబైల్ బిల్లు, ఫుడ్, బీమా, ప్రయాణం, ఇతర ప్రయోజనాలు అన్ని కలిపి విజయ్ శేఖర్ శర్మ వేతనం (Paytm’s Vijay Shekhar Sharma salary) దాదాపు రూ.3 కోట్లు. క్వికర్ సీఈవో కమ్ వ్యవస్థాపకులు ప్రణయ్ (Quikr’s Pranay Chulet salary) FY18లో 4.28 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. సచిన్ బన్సల్ (Sachin Bansal) యాజమాన్యంలోని నేవీ (Navi) FY19లో తమ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) అంకిత్ అగర్వాల్ కు (Ankit Agarwal) అత్యధికంగా రూ.5 కోట్లు చెల్లించింది. ఇన్ క్రెడ్ సీఈవో, వ్యవస్థాపకులు భూపిందర్ సింగ్ (Bhupinder Singh) రూ.4 కోట్లు తీసుకున్నారు.