తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వికలాంగులకు ఇచ్చే ఆసరా పెన్షన్ (Aasara Pension) మొత్తాన్ని భారీగా పెంచింది. ఈ మేరకు జీవో జారీ చేసింది సర్కార్. ఇప్పటివరకు దివ్యాంగులకు రూ.3,016 పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.4,016కు పెంచారు. అంటే, వెయ్యి రూపాయల మేర పెంపు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల 20వేల మంది దివ్యాంగులకు (Disabled) లబ్ది చేకూరనుంది. ఇకపై దివ్యాంగులు నెలకు 4,016 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు.
జులై నెల నుండి ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. పెన్షన్ను మరో వెయ్యి రూపాయలు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటివరకు ప్రభుత్వం దివ్యాంగులకు ప్రతి నెల 3,016 రూపాయలు ఆసరా పెన్షన్ గా ఇస్తుండగా.. మరో వెయ్యి రూపాయలు పెంచుతూ ఇటీవలే సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేస్తూ జీవో జారీ చేశారు. తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది.
ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్ చార్జీలు (Diet charges)పెరుగనున్నాయి. పలు శాఖలకు చెందిన అనుబంధ హాస్టల్లోను డైట్చార్జీలు పెరుగనున్నది. 3వ తరగతి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8 నుంచి పదో తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1400 వరకు పెంచింది. ఇంటర్ నుంచి పీజీ వరకు రూ.1500 నుంచి రూ.1875కు పెంచుతూ ఉత్తర్వులు (Orders) జారీ చేసింది.