Delhi court summons star wrestler Bajrang Punia in defamation case filed by coach Naresh Dahiya
Wrestler: ఇండియన్ స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా(Bajrang Punia)కు ఢిల్లీ కోర్టు(Delhi court) షాక్ ఇచ్చింది. రెజ్లింగ్ కోచ్ నరేష్ దహియా(Naresh Dahiya) వేసిన క్రిమినల్ పరువు నష్టం(Criminal defamation) కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 6న కోర్టు ముందు హాజరుకావాలని మెజిస్ట్రేట్ యష్‌దీప్ చహల్ ఆదేశించారు. కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత దహియా పరువుకు భంగం కలిగేలా బజ్రంగ్ వ్యవహరించినట్లు తేలిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే మే 10న జంతర్ మంతర్(Jantar Mantar) వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కోచ్ నరేష్ దహియా పరువుకు నష్టతం వచ్చేలా మాట్లాడారని బజ్‌రంగ్‌పై క్రిమినల్ పరువు నష్టం కింద కోర్టులో దావా వేశారు.
ఈ నేపథ్యంలో ఫిటిషన్ను పరిశీలించిన కోర్టు పునియాకు సమన్లు అందించింది. ఫిర్యాదు, సపోర్టింగ్ డాక్యుమెంట్లు, ముందస్తు సాక్ష్యాలను బట్టి చూస్తే బజ్రంగ్ మీడియా మావేశంలో మాట్లాడిన తీరు దరుద్దేశంతోనే వ్యవహరించినట్లు ఉందని, కోచ్ పరువు నష్టం ఫిర్యాదును అమోదించి ఐపీసీ సెక్షన్ 499, 500 (క్రిమినల్ పరువు నష్టం) ప్రకారం ఇది శిక్షార్హమైన నేరంగా భావిస్తున్నాం అని న్యాయమూర్తి పేర్కొన్నారు. మరోవైపు ఒలంపిక్ పతక విజేత బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగాట్(Vinesh Phogat) ఆసియా గేమ్స్(Asian Games) కోసం కిర్గిస్తాన్‌లో శిక్షణ తీసుకొని తిరిగి వచ్చారు. బజ్‌రంగ్‌కు నిర్ణయించిన తేదీల కన్నా రెండు రోజులు ముందుగానే ఇండియాకు వచ్చారు.