»Water Bill In Hyderabad Is More Than 2 Lakh Rupees Owners Shocking New Bhoiguda Bansilalpet
Hyderabad:లో వాటర్ బిల్ రూ.2 లక్షలు..షాకైన ఓనర్స్
హైదరాబాద్లో మీకు ఎప్పుడైనా లక్షల రూపాయల్లో వాటర్ బిల్(water bill) వచ్చిందా?. కానీ ఓ అపార్ట్ మెంట్ ఓనర్ కు మాత్రం ఇటివల ఏకంగా 2 లక్షల రూపాయలకుపైగా నీటి బిల్లు వచ్చింది. దీంతో షాకైన ఓనర్స్ మీటర్ రీడింగ్ తప్పుగా వస్తుందని, అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్లో(hyderabad) పలు ప్రాంతాల్లో ఫ్రీ వాటర్ స్కీం వర్తిస్తున్నా కూడా ప్రతి నెల పెద్ద ఎత్తున బిల్లు వస్తుందని పలువురు వాపోతున్నారు. అవును ఇలాంటి నేపథ్యంలోనే ఓ అపార్ట్ మెంట్ యజమానికి ఏకంగా 2 లక్షల రూపాయలకు పైగా బిల్లు వచ్చింది. అంతేకాదు ఇదే యజమానికి మే నెలలో మొదట లక్షా 74వ వేల బిల్లు వచ్చింది. దాన్ని పరిశీలించాలని కోరగా..మళ్లీ ఏకంగా 2 లక్షలకుపైగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ బిల్లు విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులతో సహా స్థానికులు వామ్మో ఇంత మొత్తంలో బిల్లు(water bill) రావడమెంటని షాక్ అవుతున్నారు.
బన్సీలాల్ పేట(bansilalpet) డివిజన్ న్యూబోయిగూడ(new bhoiguda)లోని ఎంఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టు అపార్ట్ మెంటులో 77 ప్లాట్లు ఉన్నాయి. అయితే వారు ఫ్రీ వాటర్ స్కీం ద్వారా వారి పేరు 2021 ఆగస్టులో నమోదు చేసుకున్నారు. ఆ క్రమంలో జీహెచ్ఎంసీ వారు వారికి ఆక్సుపెన్సీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆ నేపథ్యంలో వారి స్కీం ద్వారా 2022 సెప్టెంబర్ వరకు వాటర్ బోర్డు బిల్లులు ఇవ్వలేదు. ఫ్రీగానే ఉపయోగించుకున్నారు. ఆ నేపథ్యంలో మీటర్ రీడింగ్ చూడకుండానే మే 5న లక్షా 74 వేల 182 రూపాయల బిల్లు వేశారని ఓనర్ పేర్కొన్నారు. దీంతో ఆ బిల్లు పొరపాటున వేశారేమోనని మళ్లీ పరిశీలించాలని అధికారులను కోరారు.
ఆ క్రమంలో నల్లా మీటర్ పనిచేయడం లేదని, అది మార్చుకోవాలని అధికారులు(officers) వారికి చెప్పారు. దీంతో ఓనర్స్ మే 13న కొత్త మీటర్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత వారికి మే 19న కొత్త మీటర్ ద్వారా ఏకంగా 2 లక్షల 17 వేల 948 రూపాయల బిల్లు వచ్చింది. ఇది చూసిన వారు మళ్లీ షాకైయ్యారు. మీటర్ రీడింగ్ లో అక్రమాలు ఉన్నాయని వాపోయారు. అంతేకాదు మీటర్లు సప్లై చేసే సావెర్లీ ఏజెన్సీ మీటర్ మార్చేందుకు రూ.25 వేలు తీసుకున్నారని అపార్ట్ మెంట్ అధ్యక్షులు హనుమండ్లు పేర్కొన్నారు. ఈ మీటర్ల వ్యవస్థలో అక్రమాలు జరుగుతున్నాయని దీనిపై చర్యలు తీసుకోవాలని బాధిత ఓనర్ కోరుతున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.