»Daksha Nagarkar Said Apologized From Naga Chaitanya In Bangarraju Movie
Daksha Nagarkar: నాగ చైతన్య క్షమాపణ చెప్పాడు
టాలీవుడ్ స్టారో హీరో నాగ చైతన్య(Naga Chaitanya) గురించి యంగ్ హీరోయిన్ దక్ష నాగార్కర్(Daksha Nagarkar) కీలక అంశాలను వెల్లడించింది. బంగార్రాజు చిత్రంలో షూటింగ్లో భాగంగా లిప్, హగ్ సీన్స్ చేసిన తర్వాత చైతన్య తనకు క్షమాపణ చెప్పాడని తెలిపింది. అతను చాలా జెంటిల్ మాన్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.
‘బంగార్రాజు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరో నాగ చైతన్య(Naga Chaitanya), దక్ష నాగార్కర్(Daksha Nagarkar)లు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చాలా ముచ్చటగా నవ్వుకున్నారు. ఆ వీడియో క్లిప్ అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాదు అది చాలా కాలంగా ట్రెండింగ్‌లో ఉండటంతో దక్షకు చాలా పేరు తెచ్చిపెట్టింది. అయితే ఇది అప్పుడు తెగ చర్చనీయాంశమైంది. మరోవైపు నాగ చైతన్య సమంతతో విడిపోయిన తర్వాత వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని పుకార్లు కూడా వచ్చాయి. అయితే అవి మెల్లగా తగ్గిపోయాయి.
కానీ రవితేజతో తన రాబోయే చిత్రం ‘రావణాసుర’ ప్రమోషన్స్‌లో భాగంగా దక్ష నాగార్కర్..చైతన్య గురించి ఆసక్తికర అంశాలను పంచుకుంది. చైతన్యను ప్రతి అమ్మాయి తమ జీవితంలో పొందాలనుకునే స్వీట్ అబ్బాయి అని చెప్పుకొచ్చింది. అంతేకాదు అతను చాలా కూల్, స్మార్ట్‌గా ఉంటాడని తెలిపింది. అతను మహిళల గురించి చాలా శ్రద్ధ వహించడంతోపాటు గౌరవిస్తాడని వెల్లడించింది. బంగార్రాజు మూవీలో ముద్దు పెట్టుకోవాల్సిన సన్నివేశాలు, కౌగిలించుకోవాల్సిన సీన్స్ పూర్తయిన తర్వాత చైతన్య సారీ చెప్పేవాడని వెల్లడించింది. అతను జెంటిల్ మాన్ అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని దక్ష చెప్పుకొచ్చింది. మరోవైపు ‘మజిలీ’ నటుడి గురించి ఇన్ని విషయాలు చెప్పినప్పటికీ, గత సంవత్సరం వైరల్ అయిన వీడియో క్లిప్ గురించి అడుగగా ఆమె మాత్రం చెప్పలేదు. నాగ చైతన్యతో మరో సినిమా చేసినప్పుడు మాట్లాడుతానని తప్పించుకుంది.
హోరాహోరీ చిత్రంతో సినిమాల్లోకి వచ్చి..హుషారు, జోంబీ రెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించిన ఢిల్లీ బ్యూటీ, దక్షా నాగర్కర్. నాగార్జున బంగార్రాజులో నటించి హ్యాట్రిక్ విజయం సాధించింది. ప్రస్తుతం రవితేజ సరజన రావణాసుర మూవీలో యాక్ట్ చేస్తుంది. ఈ అమ్మడు చేసింది నాలుగు సినిమాలే అయినా మంచి గుర్తింపు దక్కించుకుంది.