CM Jagan:వైఎస్ వివేకానంద (viveka) హత్య కేసులో సీబీఐ విచారణ తుది దశకు చేరింది. అవినాష్ రెడ్డి (avinash reddy) తండ్రి భాస్కర్ రెడ్డి (bhaskar reddy) అరెస్ట్‌తో హై టెన్షన్ నెలకొంది. రేపు సాయంత్రం 4 గంటలకు అవినాష్‌ను (avinash) సీబీఐ మరోసారి విచారించనుంది. కేసు విచారణ దృష్ట్యా సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఈ రోజు సీఎం జగన్ సమావేశం అయ్యారు. ఈ నెల 21వ తేదీన ఫ్యామిలీతో లండన్ (london) వెళ్లాల్సి ఉంది. కేసు విచారణ దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. అధికార పర్యటనలను కూడా సీఎం జగన్ (cm jagan) రద్దు చేసుకున్నారు. ఈ రోజు అనంతపురం జిల్లాకు వెళ్లాల్సి ఉండే.. ఆ టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు.
మరోవైపు వివేకా (viveka) హత్యకేసులో దస్తగిరి (dastagiri) అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని అవినాష్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రస్తావించారు. హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. దీనిపై దస్తగిరి ఈ రోజు స్పందించారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌తో తనకు ప్రమాదం (threat) పొంచి ఉందని చెప్పారు. అప్రూవర్‌గా మారే సమయంలో అవినాష్ ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. వారి వరకు రానంతవరకు తాను మంచోడినని.. ఇప్పుడు చెడ్డవాడిని అయ్యానని దస్తగిరి చెబుతున్నాడు. వివేకానంద కూతురు సునీత (sunitha), సీబీఐ (cbi) నుంచి తాను రూపాయి తీసుకోలేదని దస్తగిరి చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్లలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అప్పుడు డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టు చేశాం.. ఇప్పుడు తనకు అవసరం లేదని.. అందుకే సీబీఐకి (cbi) నిజం చెప్పాం అని దస్తగిరి పేర్కొన్నాడు. పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ను (Ram singh) కూడా మార్చేశారని దస్తగిరి మండిపడ్డారు. తప్పు చేశా.. ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు సిద్దపడ్డానని దస్తగిరి (dastagiri) అంటున్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదని.. అన్నింటికీ సిద్దంగా ఉన్నానని తెలిపాడు. పులివెందుల వైఎస్ జయమ్మ కాలనీలో ఉన్నానని చెప్పాడు. తప్పు చేసినట్టు రుజువైతే రాజీనామా చేస్తారా అని జగన్, అవినాష్‌ను దస్తగిరి ప్రశ్నించాడు.