తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని (Telangana Cabinet) విస్తరించే అవకాశం ఉన్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఖాళీ అయిన ఈటల రాజేందర్ స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి(MLC Mahender Reddy)ని కేబినెట్లోకి తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందరు (Etala Rajender) భర్తరఫ్ చేయడంతో ఓ మంత్రి పోస్టు ఖాళీ అయింది.
ఆ పదవిని పట్నం మహేందర్ రెడ్డి (తాండూర్ మాజీ ఎమ్మెల్యే)కు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి బండ ప్రకాశ్ కూడా రేసులో ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒకరిని తప్పించి. మరొకరికి ఛాన్స్ ఇస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Soundararajan) ఈ రోజు రాత్రికి పుదుచ్చేరి నుండి హైదరాబాద్ రానున్నారు. ఆ తర్వాత మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణం ఉంటుందని తెలుస్తోంది. నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన, ఎన్నికలకు మరో మూడు నాలుగు నెలలు మాత్రమే ఉన్న సమయంలో కేబినెట్ విస్తరణ (Cabinet expansion) ఆసక్తికరంగా మారింది.