ఏపీ సీఎం జగన్ (Cm Jagan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ తరుణంలో ఆయన విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లో (Diagnostics centre) వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాలి మడమ నొప్పితో సీఎం జగన్ బాధపడుతున్నట్లు సమాచారం. అయితే వైద్యులు ఆయనకు ఎంఆర్ఐ మెడికల్ టెస్ట్ (MRI medical Test) చేశారని తెలుస్తోంది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధప్రదేశ్ సీఎం జగన్ గత కొంతకాలంగా కాలి మడమ నొప్పి (Heel Pain)తో బాధపడుతున్నారని, గతంలోనే ఆయన నొప్పి వల్ల జనరల్ చెకప్ చేయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మధ్యనే సీఎం జగన్ వ్యాయాయం చేస్తుండగా కాలు బెణికిందని, ఆ సమయంలో ఆయనకు వైద్యులు చికిత్స చేశారని సమాచారం. వైద్యులు సీఎం జగన్ ను విశ్రాంతి తీసుకోమన్నారని సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన మడమనొప్పితో బాధ పడుతుండగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.