»Central Health Ministry To Conduct Video Conference To States
Central health ministry రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్.. ఎందుకంటే?
Central health ministry:దేశంలో మళ్లీ కరోనా (corona) కేసులు పెగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ (Central health ministry) అలర్ట్ అయ్యింది. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) నిర్వహించనుంది. కరోనా కేసుల పెరుగుదల, అనుసరించాల్సిన వ్యుహాంపై నిర్దేశం చేయనుంది.
Central health ministry to conduct video conference to states
Central health ministry:దేశంలో మళ్లీ కరోనా (corona) కేసులు పెగుతున్నాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశం. దీంతో కేంద్ర వైద్యారోగ్యశాఖ (Central health ministry) అలర్ట్ అయ్యింది. ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) నిర్వహించనుంది. కరోనా కేసుల పెరుగుదల, అనుసరించాల్సిన వ్యుహాంపై నిర్దేశం చేయనుంది.
కరోనా కేసులే కాదు.. మరణాలు (deaths) కూడా జరగడంతో వైద్యారోగ్య శాఖ (health ministry) అప్రమత్తం అయ్యింది. రోజువారీ కేసులు కూడా వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. 5 నెలల (5 months) తర్వాత పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వైరస్ (virus) కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సుధీర్ఘంగా చర్చించనుంది.
దేశంలో వస్తోన్న కరోనా వేరియంట్‌ను (corona varient) ఎక్స్‌బీబీ 1.16గా గుర్తించారు. ఈ వైరస్ కూడా వేగంగా వ్యాపిస్తోందని వైద్యులు (doctors) చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ (second wave) అల్లాడించింది. దాదాపు ఇంటింటికీ వైరస్ (virus) సోకింది. సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకున్న వారు మాత్రమే బతికి బట్టకట్టారు. నిర్లక్ష్యం చేసిన వారు మాత్రం ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారిలో యువతే (youth) ఎక్కువ ఉండటం ఆందోళన కలిగించింది. ఆ తర్వాత థర్డ్, ఫోర్త్ వేవ్ వచ్చినా.. అంతలా ప్రభావం చూపలేదు.
ఇప్పుడు కొత్త వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. దీంతోపాటు ఇన్ ఫ్లూయెంజా వైరస్ కూడా కాస్త భయపెట్టింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో కేసులు మాత్రం నమోదు కాలేదు. దీంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.