తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఆర్టీసీ(TSRTC) బస్సును లోడుతో వెళ్తున్న బొగ్గు లారీ(coal lorry) ఢీ కొట్టింది. ఈ ఘటన సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తుండగా.. 43 మందికి గాయాలయ్యాయి. బస్సు ఆదివారం ఉదయం భద్రాచలం డిపో నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్(accident) జరిగింది. మరోవైపు అదే క్రమంలో స్పీడుగా వచ్చిన బొగ్గు లారీ ఆనందగని ప్రాంతంలో ఢీ కొనడంతో ప్రమాదం సంభవించింది. ఆ క్రమంలో ప్రయాణికుల బస్సు పల్టీలు కూడా కొట్టింది.
ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న పోలీసులు(police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతోపాటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గాయపడిన వారిలో విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది.