జపాన్(japan)లోని ఇషికావా నోటోలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం భూకంపం 60 కి.మీ లోతులో సంభవించిందని తెలుస్తోంది.
అయితే ప్రస్తుతానికి ఏదైనా మరణాలు సంభవించాయా లేదా ఇంకా ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.