Sanjay Datt : షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్..సంజయ్ దత్కు గాయాలు
కేడీ సినిమా(Kedi Movie) షూటింగులో సంజయ్ దత్(Sanjay Datt)కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగు(Movie Shooting)లో భాగంగా ఓ సీన్ లో బాంబు బ్లాస్ట్ పేలుడు చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే సంజయ్ దత్కు గాయం అయినట్లు సమాచారం.
కేజీఎఫ్(KGF) సినిమా తర్వాత బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో సంజయ్ దత్(Sanjay Dutt)కు సరికొత్త ఇమేజ్ వచ్చిందని చెప్పాలి. బాలీవుడ్లో ఆయన చాలా సినిమాలు చేసినప్పటికీ దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రం కేజీఎఫ్ తో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత కన్నడ పరిశ్రమలోని మరో సినిమాలో ఆయన విలన్(Villan)గా నటిస్తున్నాడు. హీరోగా ఓ వెలుగు వెలిగిన సంజయ్ దత్ నెగిటిల్ షేడ్స్ పాత్రలు చేయడంతో ఆయన ట్రెండ్ మార్చుకున్నారు. కేజీఎఫ్ లో ఆయన నటించిన అధీరా(Adhira) పాత్ర ఎంతో ఫేమస్ అయ్యింది.
అధీరా(Adhira) పాత్ర అటు విలనిజాన్ని ఇటు క్రూరత్వాన్ని కొత్త కోణంలో చూపింది. ఆ సినిమా తర్వాత సంజయ్ దత్ (Sanjay Dutt)కు చాలా ఆఫర్లు క్యూకట్టాయి. అయితే ఆయన తన క్యారెక్టర్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్(Action King Arjun) మేనల్లుడు అయిన ధ్రువ్ సర్జా(Dhruv Sarja) హీరోగా కేడీ(Kedi) అనే సినిమా రూపొందుతోంది.
కేడీ సినిమా(Kedi Movie) షూటింగులో సంజయ్ దత్(Sanjay Dutt)కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగు(Movie Shooting)లో భాగంగా ఓ సీన్ లో బాంబు బ్లాస్ట్ పేలుడు చేయాల్సి ఉంది. ఆ టైంలో ఫైట్ మాస్టర్ రవి వర్మ నేతృత్వంలో ఓ భారీ బాంబు పేలుడు సీన్ చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలోనే సంజయ్ దత్కు గాయం అయినట్లు సమాచారం.
షూటింగు ప్రమాదంలో సంజయ్ దత్ (Sanjay Dutt)కు గాయం కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సంజయ్ దత్ ముఖానికి, చేతికి, భుజానికి గాయాలవ్వడంతో షూటింగ్ ఆపేసినట్లు సమాచారం. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బావుందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కన్నడ చిత్ర పరిశ్రమ(Movie Industry) వర్గాలు వెల్లడించాయి.