»Keerthy Suresh Said The Dubbing Without Hesitation The Video Is Viral
Keerthy Suresh : తడబడకుండా డబ్బింగ్ చెప్పిన కీర్తి సురేష్..వీడియో వైరల్
దసరా మూవీ కోసం కీర్తి సురేష్ డబ్బింగ్(Dubbing) చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఏ మాత్రం తడబడకుండా కీర్తి సురేష్ తానే డబ్బింగ్(Dubbing) చెబుతున్నప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది.
మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి తెలియని సినీ ప్రియులు ఎవ్వరూ ఉండరు. అందం, అభినయంతో పాటు ఆమె నటన, డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. పాత్ర ఏదైనా సరే అందులో ఒదిగిపోవడం కీర్తి సురేష్ నైజం. తాజాగా ఆమె నటించిన దసరా(Dasara) సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. దసరా సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల (Vennela) పాత్రలో ఒదిగిపోయింది. ఈ మూవీలో ఆమె మాస్ లుక్ అందర్నీ కట్టిపడేసిందని చెప్పాలి. వెన్నెల పాత్ర డీ గ్లామర్ అయినప్పటికీ ఆడియన్స్ ఆ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు.
దసరా సినిమా కోసం డబ్బింగ్ చెప్పిన కీర్తిసురేష్ వీడియో:
దసరా మూవీ(Dasara Movie) తెలంగాణ నేపథ్యంలో నడిచే కథ కావడంతో మూవీలో కీర్తి సురేష్(Keerthy Suresh) తెలంగాణ యాసలోనే డైలాగ్స్ చెప్పి అందర్నీ అలరించింది. చాలా మంది ఈ మూవీలో తానే డబ్బింగ్ చెప్పుకుందంటే అస్సలు నమ్మరు. తాజాగా దసరా మూవీ కోసం కీర్తి సురేష్ డబ్బింగ్(Dubbing) చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది. ఏ మాత్రం తడబడకుండా కీర్తి సురేష్ తానే డబ్బింగ్(Dubbing) చెబుతున్నప్పటి వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్లో నిలిచింది.
కీర్తి సురేష్(Keerthy Suresh) డబ్బింగ్ చెప్పిన విధానం చూస్తుంటే ఆమె అంకితభావం ఏ రేంజ్ లో ఉందనేది అందరికీ అర్థమవుతుంది. ఈ మూవీలో పెళ్లి కూతురుగా కీర్తి సురేష్ వేసిన మాస్ స్టెప్పులు అందర్నీ కాలుకదిపేలా చేశాయి. ఆ వీడియోను చూసి అందరూ విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఇప్పటికే కీర్తి సురేష్ మాస్ స్టెప్పులేసిన వీడియో ట్రెండింగ్ లోనే ఉంది. కథాపరంగా తెలంగాణ నేపథ్యాన్ని కీర్తి సురేష్ అర్థం చేసుకుని అందుకు తగినట్లుగా డ్యాన్స్(Dance) వేయడమే కాకుండా డబ్బింగ్ (Dubbing) చెప్పడంతో కీర్తి సురేష్ ను నిజంగానే ఆమె మహానటి అంటూ కీర్తిస్తున్నారు.