»Biggest In The World Half The Hill Is The Whole Hotpot Restaurant Chongqing China
World Biggest: సగం కొండ మొత్తం రెస్టారెంట్
ప్రపంచంలోనే అతిపెద్ద హాట్ పాట్ రెస్టారెంట్(hotpot restaurant) దాదాపు సగం కొండను మొత్తం ఆక్రమించింది. అంతేకాదు ఇక్కడ ఒకేసారి 5,800 మంది భోజనం చేసే అవకాశం ఉందని నిర్వహకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రెస్టారెంట్ గిన్నిస్ రికార్డుల్లో కూడా చేరింది. అసలు ఈ హోటల్ ఎందుకు ఫేమస్సో ఇప్పుడు చుద్దాం.
ఒక కొండలో సగం మొత్తం రెస్టారెంట్ గా మారిపోయింది. అవును మీరు విన్నది నిజమే. ఎక్కడంటే చైనీస్ నగరం చాంగ్కింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద హాట్ పాట్ రెస్టారెంట్(hotpot restaurant)కు నిలయంగా మారింది. ఇది మొత్తం కొండప్రాంతాన్ని దాదాపు సగం కప్పి ఉంచే ఒక భారీ హోటల్ గా నిలిచింది. అయితే ఇక్కడ ఒకేసారి 5,800 మంది కూర్చునే అవకాశం ఉండగా.. దాదాపు 900 టేబుల్లను ఏర్పాటు చేశారు.
అసలు హాట్ పాట్ అంటే ఏంటో ఇప్పుడు చుద్దాం. కొంత మంది ఓ చోట చేరి.. టేబుల్ మధ్యలో ఓ పాత్ర పెట్టి వండుకోవడం. ఆ తర్వాత ఆ వంటకాన్ని అక్కడి వ్యక్తలు ముచ్చట్లు చెప్పుకుంటూ తినేవిధానాన్ని హాట్ పాట్ అని పిలుస్తున్నారు.
ఇది కూడా చూడండి:Viral Video:10 వేల ఫీట్ల ఎత్తులో స్కై డైవింగ్ చేస్తూ ఆ పని..
చాంగ్కింగ్ దాని హాట్ పాట్‌కు ప్రసిద్ధి చెందింది. చాంగ్కింగ్(chongqing) శివార్లలో ఉన్న నాన్ జిల్లాలో 3,300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది పిపా యువాన్ ప్రపంచంలోనే అతిపెద్ద హాట్ పాట్ రెస్టారెంట్‌గా ప్రసిద్ధి చెందింది. అయితే గత సంవత్సరం ఈ హోటల్ గిన్నిస్ రికార్డ్స్ టైటిల్‌ను కూడా దక్కించుకుంది.
పిపా యువాన్ ఇది నిటారుగా ఉన్న కొండపై ఉన్నందున.. కొండ దిగువన ఉన్న పార్కింగ్ స్థలం నుంచి పైకి వెళ్లాలంటే 30 నిమిషాల వరకు పట్టవచ్చు. రెస్టారెంట్లో ప్రస్తుతం 888 టేబుల్లు అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, రెస్టారెంట్ యొక్క భారీ సామర్థ్యం ఉన్నప్పటికీ, రిజర్వేషన్ లేకుండా వెళ్లడం చాలా కష్టమని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాదాపు అన్ని కాలాల్లో పెద్ద ఎత్తున రష్ ఉంటుందని అంటున్నారు.
చైనాతోపాటు అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ప్రపంచంలోనే అతి పెద్ద హాట్ పాట్ రెస్టారెంట్‌ను వ్యక్తిగతంగా అనుభవించడానికి వస్తారని నిర్వహకులు పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, పిపా యువాన్ పగటిపూట వలె రాత్రిపూట కూడా బిజీగా ఉంటుంది. రాత్రిపూట అనేక మంది పర్యాటకులు కొండపైన లైట్ల వెలుగుల్లో వంటకాలు తింటూ ఆస్వాదిస్తారని వెల్లడిస్తున్నారు.