SKLM: నరసన్నపేట మండలం కంబకాయ గ్రామంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించారు. బుధవారం ఈ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా గ్రామానికి రావడం జరిగిందని నేడు రావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ పరిస్థితులపై స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న ఇరువురు కార్యకర్తలను కలిసి ఆరోగ్య పరిస్థితిలో అడిగి తెలుసుకున్నారు.