ప్రకాశం: త్రిపురాంతకం మండలంలోని గణపవరం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గణపవరం మెట్టవద్ద గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.