APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ఎండీతో పాటు మరో నలుగురికి జైలుశిక్ష
కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో ఏపీ ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటుగా మరో ముగ్గురికి హైకోర్టు(High Court) శిక్ష వేసింది.
ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ఎండీతో పాటుగా మరో నలుగురికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు(High Court) తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన కేసులో ఏపీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదుగురు అధికారులకు నెల రోజుల పాటు హైకోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ ఫీల్డ్ మెన్లను క్రమబద్దీకరించాలని(Regularize ) గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అధికారులు హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదు.
ఈ విషయంలో ఫీల్డ్ మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు. గురువారం ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో ఏపీ ఆర్టీసీ ఎండీ(AP RTC MD) ద్వారకా తిరుమలరావు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో పాటుగా మరో ముగ్గురికి హైకోర్టు(High Court) శిక్ష వేసింది. వీరికి నెల రోజుల జైలు శిక్ష విధిస్తూ వెయ్యి రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. మే నెల 16వ తేదిలోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద ఆ ఐదుగురు లొంగిపోవాలని హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది.