AP MLC Elections: గెలిచిన టీడీపీ, అనవసరంగా నన్ను లాగొద్దన్న శ్రీదేవి
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) గట్టి షాక్ తగిలింది. 2019లో టీడీపీ (Telugu Desam Party) నుండి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మద్దతు పలుకుతారని, దీంతో తాము రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని జగన్ (YS Jagan, chief minister of andhra pradesh) ధీమాగా ఉన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Andhra Pradesh MLC Elections) వైసీపీ ప్రభుత్వానికి (YCP Government) గట్టి షాక్ తగిలింది. 2019లో టీడీపీ (Telugu Desam Party) నుండి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు మద్దతు పలుకుతారని, దీంతో తాము రెండో ప్రాధాన్యత ఓటుతో అయినా ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని జగన్ (YS Jagan, chief minister of andhra pradesh) ధీమాగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి గెలవాలంటే 22 ఓట్లు రావాలి. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో అవే ఓట్లు వచ్చాయి ఆ పార్టీకి. అయితే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీకి మద్దతు పలకడంతో… జగన్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు (Panchumarthi Anuradha) ఓటేశారు. దీంతో లెక్క సరిపోయింది. టీడీపీ మాత్రం తాము గత ఎన్నికల్లో గెలిచిన ఓట్లు సాధించామని, క్రాస్ ఓటింగ్ గురించి వేసిన వారిని అడగాలని చెబుతోంది. వాస్తవానికి ఏడో స్థానంలో టీడీపీయే గెలవాలి. ఎందుకంటే ఆ పార్టీకి టెక్నికల్ గా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ వైసీపీ ఏడో అభ్యర్థిని నిలబెట్టింది. చంద్రబాబు చక్రం తిప్పి, అనురాధ గెలిచేలా పావులు కదిపారు.
టీడీపీ నుండి గెలిచిన పంచుమర్తికి ఓటు వేసిన నలుగురిని వైసీపీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy), వెంకటగిరి సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిలు (Anam Ramanarayana Reddy) ఆత్మప్రబోధానుసారం ఓటు వేశారు. అంటే వీరు టీడీపీకి ఓటు వేసినట్లుగా భావిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకే చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డికి (Mekapati Chandrasekhar Reddy) వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే అడిగిన కొన్ని పనులు జగన్ చేయడం లేదు. దీంతో మేకపాటి కూడా టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) పేరు కూడా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆమె కూడా టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి ఉంటారని భావిస్తున్నారు.
నన్ను లాగొద్దు.. శ్రీదేవి
తాను క్రాస్ ఓటింగ్ (Cross Voting)కు పాల్పడలేదని, అనవసరంగా తనను ఇందులోకి లాగవద్దని వుండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) ఆవేదన వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే తనకు లేదని, తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే అన్నారు. పార్టీ ఇచ్చిన కోడ్ ప్రకారమే తాను ఓటు వేశానని, ఉదయమే తన కుమార్తెతో పాటు సీఎం జగన్ గారిని కలిశానని గుర్తు చేశారు. సొంత అన్నలా చూసుకుంటానని తనతో జగన్ చెప్పారని, జగన్ నుండి తనకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయన్నారు. తమకు కొన్ని విలువలు ఉన్నాయని, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని, దళిత మహిళపై దుష్ప్రచారం చేయవద్దన్నారు. రాజధాని ప్రాంత ఎమ్మెల్యేను కాబట్టి తనను అవమానిస్తున్నారన్నారు. తాను అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉంటే నియోజకవర్గానికి ఇంచార్జిని పెట్టినప్పుడే రాజీనామా చేయాలని, తాను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఆ 22 మందిని స్క్రూటిని చేసి నిజాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. తనకు క్రాస్ ఓటింగ్ చేయాల్సిన అవసరమే లేదని, ఇందులోకి తన పేరును దయచేసి లాగవద్దన్నారు.