ఏపీలో మరో టమాటా రైతును హత్య చేశారు. రైతును హత్య చేసి టమాటాలను దొంగిలించారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏపీ(Andhrapradesh)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా(annamayya district)లో మరో టమాటా రైతును హత్య(Tomato Farmer Murder) చేశారు. వారం రోజుల్లోనే ఇలా టమాటా రైతును హత్య చేయడం రెండో ఘటన. ఇదే జిల్లాలో వారం క్రితం బోడుమల్లడిన్నె గ్రామంలో టమాటాల కోసం రైతు నరేం రాజశేఖరరెడ్డి(Narem Rajasekhar Reddy)ని హత్య(Murder) చేసిన ఘటన జరిగింది.
పెద్దతిప్ప సముద్రం గ్రామానికి చెందిన మధుకరరెడ్డి(Madhukara Reddy) అనే రైతును గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి హత్య(Murder) చేశారు. ఆ తర్వాత టమాటాలను దొంగిలించారు. టమాటా(Tomato Rates) ధరలు భారీగా పెరగడంతో రైతులు తమ పంటను కాపాడుకునేందుకు రాత్రిల్లో పొలం వద్దే కాపలాగా ఉంటున్నారు.
చాలా మంది రైతులు(Tomato Farmer) తమ పొలాల వద్ద రాత్రి పూట నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో తన పొలానికి కాపలాగా ఉన్న మధుకర రెడ్డి(Madhukara Reddy)ని దుండగులు హత్య చేసి పరారయ్యారు. సోమవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి కుటుంబీకులకు ఆయన శవం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు(Police case) చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.