»Another Person Prashanth Arrested In Tspsc Leakage Case At Mahabubagar
TSPSC లీకేజీ కేసులో మరొకరు అరెస్టు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్(SIT) వేగం పెంచింది. తెలంగాణలో సంచలనంగా తయారైన TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో మరొకరు అరెస్టు అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్(prashanth)ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో సంచలనంగా తయారైన TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో మరొకరు అరెస్టు అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్(prashanth)ను సిట్(SIT) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 13కు పెరిగింది. అయితే రాజశేఖర్ రెడ్డి చెప్పిన సమాచారం మేరకు ప్రశాంత్ ను అరెస్ట్ చేసినట్లు సమాచారం. గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రశ్నాపత్నం కొనుగోలు చేసిన ప్రశాంత్ కు 100కుపైగా మార్కులు వచ్చినట్లు సిట్ విచారణలో తేలింది. ఇంకోవైపు ఈ కేసు అంశంపై ఆరోపణలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి కూడా మరోసారి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకోని విచారిస్తున్నారు. TSPSCలో పనిచేస్తోన్న 42 మంది ఎంప్లాయ్ కి నోటీసులు జారీ (Issuance of notices) చేసింది. టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఐటీ సిబ్బందికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ (Praveen )రాజశేఖర్‌లతో సన్నిహితంగా ఉన్నవారిపై సిట్ ఫోకస్ పెంచింది. ఇప్పటికే కమిషన్‌లో పనిచేస్తోన్న 10 మంది గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు గుర్తించిన సిట్.. దర్యాప్తులో భాగంగా వారందరికి నోటీసులు పంపింది. అంతేకాకుండా కాన్ఫిడెన్షియల్ రూమ్ ఇన్చార్జ్గా ఉన్న శంకరలక్ష్మీ (Shankara laxmi) పాత్రపై మరింత దర్యాప్తు చేయాలని సిట్ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితురాలు రేణుకతో టచ్‌లో ఉన్న కోచింగ్ సెంటర్ నిర్వాహకులు.. అభ్యర్థులను కూడా విచారించేందుకు సిట్ సిద్ధం అయ్యింది.
పలు అంశాలపై టెక్నికల్ ఆధారాలు సేకరించింది సైబర్ క్రైమ్ టెక్నికల్ టీం(Cybercrime Technical Team). రేణుక, నీలేష్, గోపాల్ మధ్య 14 లక్షల నగదు ఆర్థిక లావాదేవీలు జరగగా ఆ అంశాల మీద రాజశేఖర్ కాంటాక్ట్స్ & వాట్స్ అప్ చాటింగ్ వివరాలపై సిట్ అరా తీసింది. రాజశేఖర్ స్నేహితుడు సురేష్ ఇంకెవరికి అయిన ప్రశ్నాపత్రం లీక్ చేశాడా ? అని సురేష్ ను సిట్ విచారించినట్టు తెలుస్తోంది. సురేష్ & రాజ్ శేఖర్ లావాదేవీలు (transactions) వారి వాట్స్ అప్ & కాల్ డేటా పై ఆరా తీసినట్టు సమాచారం.