»Amruta Fadnavis Blackmail Case Bookie Arrested From Gujarat
Amruta Fadnavis blackmail case: కూతురు తర్వాత… ఘరానా బూకీ అరెస్ట్
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి (devendra fadnavis wife) అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీని పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (Maharashtra Former Chief Minister) దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి (devendra fadnavis wife) అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis)ను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన కేసులో కీలక నిందితుడు అనిల్ జైసింఘానీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఫోన్లను మార్చేస్తూ రెండు సార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఎట్టకేలకు వడోదర సమీపంలోని కోలాల్ వద్ద ఆదివారం పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు. పోలీసులు 72 గంటల పాటు ఆపరేషన్ ఏజే పేరుతో గాలింపు చేపట్టారు. 750 కిలో మీటర్లు అతనిని వెంటాడారు. చివరకు గుజరాత్ లో అరెస్ట్ చేసి, మలబార్ హిల్స్ పోలీసులకు అప్పగించారు. నిందితుడిని ఈ రోజు కోర్టులో ప్రవేశ పెడుతున్నారు.
అనిల్ జైసింఘానీ ఓ బుకీ. అతను గుజరాత్ కు చెందినవాడు. అతను పేరుమోసిన అంతర్జాతీయ క్రికెట్ బూకీగా చెబుతున్నారు. ఐపీఎల్ సమయంలో కోట్లాది రూపాయలతో బెట్టింగులు నిర్వహిస్తాడని అంటారు. ఆ కేసుల్లో చిక్కకుండా ఉండేందుకు పోలీసులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత వాటిని వీడియోలుగా తీసి, పోలీసులనే బ్లాక్ మెయిల్ చేస్తాడట. గతంలో ఎన్సీపీ తరఫున కార్పోరేటర్ గా పని చేశాడు.
ఈ కేసులో అతని కూతురు అనిక్షా జైసింఘానీని వారం క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. అనిల్ పైన పద్నాలుగు… పదిహేను కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మూడు రోజుల ఆపరేషన్ తర్వాత అతను గుజరాత్ లోని గోధారలో అరెస్టయ్యాడు. అనిల్ చాలా కాలంగా పోలీసుల కన్నుగప్పి తిరుగుతున్నాడు. అతను టెక్నాలజీని ఉపయోగించుకొని తప్పించుకు తిరుగుతున్నాడు. అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు ఎన్ క్రిప్టెడ్ కాల్స్ చేస్తున్నాడు. అతనిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడ్డారు. అతను ఎన్నో కేసుల్లో వాంటెడ్ గా ఉన్నాడు.
‘నిందితుడిని బర్దోలిలో పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశాం. కానీ అతను అక్కడి నుండి తప్పించుకున్నాడు. అక్కడి నుండి సూరత్ వెళ్లాడు. అక్కడి నుండి కూడా పారిపోయాడు. అయితే వదోదర మీదుగా గోద్రా పారిపోతుండగా పట్టుబడ్డాడు’ అని డీసీపీ బాల్ సింగ్ రాజ్ పుట్ తెలిపారు. ఆపరేషన్ ఏజే చేపట్టి అనిల్ జైసింఘానీని గుజరాత్ లో అరెస్ట్ చేశామని, సినీ ఫక్కీలో ఫోన్లను మార్చేస్తూ రెండు సార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడన్నారు. అనిల్ మొబైల్ లొకేషన్ ఆధారంగా మొదటిసారి గుజరాత్ లో శుక్రవారం గుర్తించారు. ఆ తర్వాత సూరత్ లో గుర్తించారు. ఆ రెండు చోట్లకు వెళ్లేసరికి పారిపోయాడు. అతను సిమ్ కార్డ్స్ నుండి అసలు ఫోన్ చేయడం లేదని పోలీసులు తెలిపారు. ఇంటర్నెట్ ఆధారిత వీవోఐపీ కాల్స్ మాత్రమే చేస్తాడని తెలిపారు. అతను వేర్వేరు పేర్లతో డాంగిల్స్ ను కొనుగోలు చేసేవాడన్నారు. వాటిని కూడా ఐదారు రోజులకు ఓసారి మార్చేవాడని తెలిపారు. అతని నుండి రెండు డాంగిల్స్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనిల్ జై సింఘానీ కూతురు అనిక్ష… అమృత ఫడ్నవీస్ ను బెదిరించింది. తొలుత రూ.1 కోటి ఇస్తానని, తన తండ్రి అనిల్ ను కేసుల నుండి బయటపడేయమని కోరింది. దానికి అమృత నిరాకరించడంతో కొన్ని మార్ఫింగ్ వీడియోలను తయారు చేసి, వాటిని లీక్ చేస్తానని అమృతను బెదిరించింది. తనకు రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడం గమనార్హం. దీంతో అమృత బ్లాక్ మెయిల్, బెదిరింపుల కేసు పెట్టారు.