శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. భూమిని పోలిన మరో భూ గ్రహాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. దాదాపుగా భూమి మాదిగానే ఉన్న ఓ గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో గుర్తించారు. పైగా ఆ గ్రహం కూడా భూమి పరిమాణంలోనే ఉండటం విశేషం. మనకు కేవలం 41 కాంతి సంవత్సరాల దూరంలో ఆ గ్రహం ఉందని, దానిని ఎల్హెచ్ఎస్ 475గా పిలుస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా మన సౌరవ్యవస్థకు అవతల ఓ గ్రహాన్ని ఇంతటి స్పష్టతతో, కచ్చితత్వంతో గుర్తించడం ఇదే తొలిసారని నాసా పరిశోధకులు తెలిపారు. మరో భూగ్రహాన్ని గుర్తించడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. భూమి మాదిరిగానే ఆ గ్రహంలో కూడా రాళ్లు, పర్వతాలు ఉన్నాయని వెల్లడించారు.