రాజమౌళి, మహేష్ బాబు(Mahesh Babu) కాంబో అంటే.. ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతు వస్తోంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకు.. ఎస్ఎస్ఎంబీ 29పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. అలాంటి సినిమా తర్వాత మహేష్ ఏ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తాడనేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఓ ముగ్గురు డైరెక్టర్ల పేర్లు మాత్రం జోరుగా ప్రచారంలో ఉన్నాయి.
ఇప్పటికే రాజమౌళి గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పేశాడు. ఈ ప్రాజెక్ట్ దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. ఈ లెక్కన మహేష్ బాక్సాఫీస్ టార్గెట్ రెండు వేల కోట్లకు పైగా ఉంటుందనడంలో ఎలాంటటి డౌట్స్ అక్కర్లేదు. ఈ సినిమాతో సూపర్ స్టార్ హాలీవుడ్లో సెటిల్ అయిపోవడం ఖాయమనేలా అంచనాలున్నాయి. ఖచ్చితంగా మహేష్ బాబు(Mahesh Babu) బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేయనున్నాడు రాజమౌళి. మరి ఇలాంటి సినిమా తర్వాత.. మహేష్ బాబుతో సినిమా చేయబోయే డైరెక్టర్ ఎవరనేది? ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 30(SSMB 30)కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడనే టాక్ జోరుగా నడుస్తోంది. రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి లేదా బాబీ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. కానీ సుకుమార్‌తో మహేష్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. గతంలో ఈ ఇద్దరు కలిసి 1 నేనొక్కడినే సినిమా చేశారు. దాంతో సుక్కు, మహేష్ కాంబో మరోసారి రిపీట్ కానుందనే టాక్ గట్టిగా ఉంది.
అలాగే అనిల్ రావిపూడి(anil ravipudi)తో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశాడు. ఈ కాంబో కూడా లైన్లో ఉంది. అయితే ఒక్క బాబీ మాత్రమే మహేష్‌తో లైన్లో కొత్త డైరెక్టర్. ఈ ముగ్గరు మాస్ డైరెక్టర్స్‌గా మంచి విజయాలను అందుకున్నారు.
దాంతో వీళ్లలో ఎవరితో మహేష్ 30వ సినిమా చేస్తాడనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వీళ్ల లెక్క తేలాలంటే.. ముందు రాజమౌళి(rajamouli) సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. రిలీజ్ అవ్వాలి. దానికి ఇంకో రెండు, మూడేళ్ల సమయం ఉంది. కాబట్టి.. ఇప్పట్లో ఎస్ఎస్ఎంబీ 30 గురించి క్లారిటీ రావడం కష్టమే!