»After Listening To The Womans Phone Conversation The Cab Driver Was Threatened And Robbed Of Rs 69 Lakhs
Cab driver: మహిళ ఫోన్ సంభాషణ విని బెదిరించి..క్యాబ్ డ్రైవర్ రూ.69 లక్షలు దోపిడీ
మహిళలు ప్రతి రోజు క్యాబుల్లో వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. వెళ్లే క్రమంలో మీరు ఫోన్ మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎవ్వరినీ కూడా నమ్మే పరిస్థితి లేదు. పక్కన ఉన్నవారు లేదా డ్రైవర్ సహా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలా విని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇక అంతే సంగతులు. అవును. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటివల జరిగింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
కర్నాటక రాధాని బెంగళూరు(Bengaluru)లో ఓ క్యాబ్ ప్రతి రోజు ఎక్కుతున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఫోన్ వ్యక్తిగత సంభాషణను ఆ డ్రైవర్(cab driver) సీక్రెట్ గా వినేవాడు. ఆ క్రమంలో ఆ సంభాషణ గురించి తెలిసి ఆమెను డ్రైవర్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఆ క్రమంలో ఏకంగా ఆమె నుంచి రూ.69 లక్షల విలువైన నగలను తీసుకున్నాడు. అయినప్పటికీ ఇంకా కావాలని అతను ఆమెను బెదిరించాడు. దీంతో ఆమె ద్వారా కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు చేసిన పోలీసులు(police) నిందితుడు హర్షఘట్టకు చెందిన క్యాబ్ డ్రైవర్ కిరణ్(30)ను అరెస్టు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ దోపిడీ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న మహిళ ఫోన్లో మాట్లాడుతున్నట్లు క్యాబ్ డ్రైవర్ విన్నాడని, ఆమెను బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించాడని అధికారులు వెల్లడించారు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఆ మహిళ గతేడాది డిసెంబర్లో ఇందిరానగర్ నుంచి బనస్వాడికి ప్రతి రోజు క్యాబ్ బుక్ చేసుకునేదని పోలీసులు అన్నారు. ఆ క్రమంలో క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, క్యాబ్ డ్రైవర్ ఆమె వ్యక్తిగత సంభాషణను విన్నప్పుడు ఆమె ఓ బాయ్ ఫ్రెండ్ తో ఫోన్లో మాట్లాడింది.
కొన్ని రోజుల తర్వాత దాన్ని అలుసుగా తీసుకున్న క్యాబ్ డ్రైవర్ ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని ఆమె చిన్ననాటి స్నేహితుడి వేషంలో టెక్స్ట్ సందేశం పంపి డబ్బులు(money) కావాలని చెప్పాడు. అయితే అది నమ్మిన ఆమె రూ.22 లక్షలు పంపించింది. ఆ తర్వాత మహిళ ఆలస్యంగా తెలుసుకోగా..తర్వాత డ్రైవర్ తన వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్తానని బెదిరించాడు. ఆ నేపథ్యంలో భయాందోళన చెందిన మహిళ తన వద్ద ఉన్న 750 గ్రాముల బంగారాన్ని గత ఏప్రిల్‌లో డ్రైవర్‌కు ఇచ్చింది. ఆ నేపథ్యంలోనే మహిళ నగల గురించి ఆమె భర్త ఆరా తీయగా ఆ మహిళ తనకు జరిగిన మొత్తం విషయాన్ని తెలిపిందని పోలీసులు స్పష్టం చేశారు.