రోడ్లు ఖాళీగా ఉన్నాయి.. ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరు. ఇంకేం రయ్ మంటూ దూసుకెళ్దామని అనుకుంటే హీరోకు జరిగినట్టే జరుగుతుంది. రోడ్లు ఖాళీగా ఉన్నాయనే ఉత్సాహంతో బైక్ ను యమ స్పీడ్ తో వెళ్లాడు. రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కాడు. పోలీసులు లేకున్నా ఎలా చిక్కాడని అనుకుంటున్నారా? మన ట్రాఫిక్ పోలీసుల డేగకళ్లు ఉన్నాయేగా. ఆత్రుత ఆపుకోలేకపోయి పోలీసులకు దొరికినట్లు ఆ హీరో సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ నటుడే కమల్ కామరాజు.
ఆవకాయ్ బిర్యానీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కమల్ కామరాజు గతంలో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ప్రస్తుతం అడపదడపా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈనెల 19వ తేదీన ఉదయం పని మీద బయటకు వెళ్తున్నాడు. రోడ్లు ఖాళీగా ఉండడంతో 60లో వెళ్లాల్సి ఉండగా 80 దాటించాడు. దీంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు తమ కెమెరాల్లో బంధించారు. వెంటనే ఆన్ లైన్ ద్వారా అతడికి చలాన్ పంపించారు. ఇది చూసుకున్న కమల్ ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు.
‘అందరికీ చెప్తా.. ఇవ్వాల నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా. పొద్దున్నే ఖాళీ రోడ్ చూసి ఉత్సాహానికి లోనై 60లో వెళ్లాలి. కానీ 80లో వెళ్లా. పొద్దున కూడా నేను స్పీడుగా వెళ్లడాన్ని గమనించి నాకు చలాన్ పంపిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు, వారు అభివృద్ధి చేసిన పద్ధతులకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. తనకు పోలీసులు పంపిన ఫొటోను కూడా షేర్ చేశాడు. హైదరాబాద్ సిటీ పోలీస్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేశాడు.
నిబంధనలు పాటిస్తే గమ్యం సురక్షితంగా చేరుతాం. అది గుర్తుంచుకుని వాహనాలు నడపండి అని పోలీసులు అవగాహన కల్పిస్తున్నా పట్టించుకోవడం లేదు. అందుకే పోలీసులు భారీగా చలాన్లు వేస్తున్నారు. ఇప్పటికైనా మారుదాం.. రోడ్డు నిబంధనలు పాటిద్దాం.
అందరికి చెప్తా… ఇవ్వాళా నా బైక్ స్పీడ్ పెంచి దొరికిపోయా . పోదున్నే కాళీ రోడ్ చూసి excite అయ్యి 60 లొ వవెళ్ళాలి 80 లొ వెళ్ళా. kudos to hyderabad traffic police and their advanced methods for capturing and sending me a challan even at such early hours. @hydcitypolice@HYDTPpic.twitter.com/KSuP5rvkVM