బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. ఆదివారం రాత్రి బెంగళూరుకు చేరుకున్నాడు. ఆస్పత్రిలోకి వెళ్లి వచ్చిన అనంతరం మనోజ్ మీడియాతో మాట్లాడాడు. తారకరత్నను చూశానని.. కోలుకుంటున్నాడని తెలిపారు. తారక్ ఫైటర్ అని.. చాలా యాక్టివ్ గల వ్యక్తి అని త్వరలో క్షేమంగా బయటకు వస్తాడని తెలిపాడు.
‘తారకరత్నను చూశా. కోలుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి తారక్, తారకరత్న బాగా తెలుసు. వంద శాతం కోలుకుంటాడు.. పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాడు. అతడు గట్టి పోరాటం గల వ్యక్తి. చాలా యాక్టివ్ మనిషి.. ర్యాలీలు.. సభల్లో బాగా పాల్గొంటున్నది నేను చూస్తున్నా. త్వరలో మళ్లీ వస్తాడు. జీవితంలో ఇలాంటివి అందరికీ వస్తుంటాయి.. పోతుంటాయి. వైద్యులు కూడా తారకరత్న పరిస్థితి చూసి సంతోషంగా ఉన్నారు. మావోడు క్షేమంగా రావాలని ఆ భగవంతుడిని, శివుడిని కోరుతున్నా. వీలైతే మీరు కూడా ప్రార్థనలు చేయండి’ అని మనోజ్ తెలిపాడు.