»A New World In Hyderabad Chocolate Karkhana Banjara Hills Road Number 12
Hyderabad:లో సరికొత్త ప్రపంచం..చాక్లెట్ కార్ఖానా
మన హైదరాబాద్‌లో(hyderabad) కొత్తగా ఏది వచ్చినా చాలు ప్రజలు కచ్చితంగా ఆస్వాదిస్తారు. ఇక వీకెండ్ అయితే మాత్రం అనేక ప్రాంతాలు పార్కులు, హాలీడే స్పాట్లు ఫ్యామిలీ జంటలతో ఫుల్ రద్దీగా కనిపిస్తాయి. ఇప్పుడు అదే కోవలోకి మరో సరికొత్త స్పాట్ వచ్చింది. అదెంటో ఇక్కడ చూసేయండి మరి.
A new world in Hyderabad Chocolate karkhana banjara hills road number 12
హైదరాబాద్‌లో(hyderabad) చాక్లెట్ ఫ్లేవర్ ను ఆస్వాదించడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి. కానీ మనం చాక్లెట్ కార్ఖానా(Manam Chocolate karkhana)లో ఉన్నట్లుగా మీకు ఎక్కడా ఇలాంటి అనుభుతి దొరకదని నిర్వహకులు చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ లైవ్ చాక్లెట్ మేకింగ్ దృశ్యాలు, మ్యూజిక్, సుగంధ సువాసనలతో ఆస్వాదించే అవకాశం ఉంటుందని అంటున్నారు. దీనిని బంజారాహిల్స్(banjarahills)లోని రోడ్‌నెం.12లో ఏర్పాటు చేశారు. మనం చాక్లెట్ కార్ఖానాలో మొత్తంగా ఒక సరికొత్త చాక్లెట్ ప్రపంచం ఉందని తెలిపారు. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ స్టోర్‌లోకి అడుగుపెడితే చక్కటి చాక్లెట్ సువాసనతో మీకు స్వాగతం ఉంటుందని అన్నారు.
ఈ స్థలం(place) మిమ్మల్ని మీరు లీనమవ్వడానికి, కోకో, చాక్లెట్లను వివరణలు, రూపాల్లో కనుగొనడానికి, అన్వేషించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తుందని నిర్వహకులు పేర్కొన్నారు. చాక్లెట్ ల్యాబ్‌లో తయారుచేసిన సరికొత్త రుచులతో మీరు రుచికరమైన అనుభూతిని పొందవచ్చని అన్నారు. దీంతోపాటు మనమ్ కేఫ్ రోజంతా క్యాజువల్ డైనింగ్ స్పేస్, ఇక్కడ చాక్లెట్ కాఫీ గింజల సిగ్నేచర్ మిశ్రమాలతో తయారు చేయబడిన ప్రత్యేక కాఫీలు లభిస్తాయని తెలిపారు.
ఇక్కడ ప్రత్యేకమైన ఆరిజిన్స్ కాకో ఫెర్మెంటరీని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి చాక్లెట్(Chocolate)మేకర్‌కి ఒక స్టైల్ ఉంటుంది. భారతీయ పద్ధతిలో చాక్లెట్‌ను తయారు చేయడం మా స్టైల్ అని వీరు చెబుతున్నారు. ఇండియన్స్ ఎలా ఇష్టపడతారో తాము చాక్లెట్లను ఎలా తయారు చేస్తామని అంటున్నారు. ఇక్కడ మీరు పచ్చి కోకో బీన్స్‌ను మృదువైన, తియ్యని చాక్లెట్‌గా మార్చడాన్ని చూడవచ్చు. ఎందుకంటే ఇది వేయించడం, పిండి, గ్రౌండింగ్ చేయడం, శుద్ధి, టెంపరింగ్, మౌల్డింగ్ వంటి ప్రక్రియల ద్వారా జరుగుతుంది.