రాష్ట్రంలో(Telangana Rains) నేడు, రేపు భారీ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాదు పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు.
తెలంగాణ(telangana)లో రెండు రోజుల పాటు (ఆగస్టు 19, 20) భారీ నుంచి అతి భారీ వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒరిస్సా తీరాల మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతం పరిధిలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని సూచించింది.
ఈ క్రమంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు(districts) వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అంతేకాదు రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, కొమరం భీం అస్ఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తలగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా భూపాలపల్లిలోని ఘన్పూర్లో 80.3 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని టీఎస్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది.