»A Bear Has Climbed A Tree In Kadapa District People Held Their Breath As Evening Descended
Bear: ఎట్టకేలకు చెట్టు దిగిన ఎలుగు బంటి..ఊపిరి పీల్చుకున్న జనం
దారితప్పి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి కుక్కల భయానికి చెట్టు ఎక్కింది. దీంతో ప్రజలు భయపడి దాన్ని అడవిలోని పంపించాలని చేసిన ప్రయత్నాలు జరగలేదు. రాత్రి వరకు అటవిశాఖ అధికారులు, గ్రామస్తులు దాని కావాలి ఉన్నారు.
A bear has climbed a tree in Kadapa district. People held their breath as evening descended
Bear: అడవి జంతువులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు ప్రజలు భయాందోళనకు గురవుతారు. కర్రలతో రాళ్లతో తరిమి కొడుతారు. అలాగే దారి తప్పి ఒక ఎలుగుబంటి ఓ గ్రామంలోకి వచ్చింది. కుక్కల నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కి కూర్చుంది. అంతే ఇక అక్కడ నుంచి దిగను అని మొండికేసి కూర్చుంది. వెంటనే గ్రామస్తులు సంబంధిత అధికారులకు చెప్పారు. వారు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. ఈ ఘటన కడప(Kadapa) జిల్లా సిద్దవటం చావిడి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానిక అటవీ ప్రాంతం ఉదయం చావిడి రోడ్డుపైకి ఎలుగుబంటి వచ్చింది. గ్రామంలోకి కొత్త జంతువు వస్తే కుక్కలు మొరగడం సాధారణమైన విషయమే కాదా.. అలాగే కుక్కలు(Dogs)మెరుగుతూ వెంటపడటంతో ఎలుగుబంటి భయంతో చెట్టుపైకి ఎక్కింది. ఇది గమనించిన గ్రామస్తులు దింపెందుకు డప్పులతో కొట్టారు కానీ అది దిగలేదు. దీంతో భయపడి అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కూడా వచ్చి చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేదు. చీకటి పడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. కానీ రాత్రి వరకు వేచీ చూడల్సిందిగా అధికారులు చెప్పడంతో చీకటి పడటంతో ఎలుగుబంటి కిందకు దిగింది. దీంతో ప్రజలు, అటవీ శాఖ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది.
ఎలుగుబంటి(Bear)కి ఎలాంటి హాని జరగకుండా కడప డీఎఫ్‌వో ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని సిద్దవటం రేంజర్ కళావతి వెల్లడించారు. కడప కార్పొరేషన్‌కు చెందిన క్రేన్ సహాయంతో దివిటిని వెలిగించి ఎలుగుబంటిని చెట్టు పైనుంచి కిందికి దింపామన్నారు. రాత్రి 11.45 గంటలకు ఎలుగుబంటి చెట్టు నుంచి కిందకు దిగి ఆనందాశ్రమం వైపు నుంచి అడవిలోకి సురక్షితంగా వెళ్లిందని కళావతి పేర్కొన్నారు. దీంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారు.