»A 22 Year Old Man Died Of A Heart Attack At Tirupati Two Incidents On The Same Day In Ap
Heart Attack: 22 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి…ఒకే రోజు ఇద్దరు
ఏపీలో ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందారు. 22 ఏళ్ల ఓ వ్యక్తి తిరుపతిలో మృతి చెందగా, 28 ఏళ్ల మరో వ్యక్తి కర్నూల్ జిల్లాలో మరణించాడు. రోజురోజుకు గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం పట్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఏపీ(ap)లోని తిరుపతి జిల్లా(tirupati) పిచ్చాటూరు మండలం శివగిరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 22 ఏళ్ల తాడి విజయ్ ఉదయం 5 గంటల సమయంలో గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. గమనించి స్థానికులు ఆస్పత్రికి తరలించడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఇటీవల ఇదే జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థి(inter student) 17 ఏళ్ల సతీష్ పరీక్ష రాసేందుకు వెళ్లి కిందపడిపోయాడు. ఆ క్రమంలో అతన్ని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్(28)(software engineer) జిమ్(gym)కు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన అతని స్నేహితులు హుటాహుటిన ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో అతన్ని పరీక్షించిన వైద్యులు యువకుడు అప్పటికే గుండెపోటు(heart attack)తో మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోని(adoni kurnool ap)లో శనివారం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు(family) ఆస్పత్రికి చేరుకుని విలపించారు. అతడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు అతని పేరు చెప్పేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
అయితే ఇతను హైదరాబాద్లోని(hyderabad) ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్(software engineer) గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వర్క్ హోం విధానంలో ఇంటి వద్దే ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నాడు. మరోవైపు ఇతనికి ఇటీవలె పెళ్లి కూడా ఖాయామైంది. ఎక్సర్ సైజ్ చేసేందుకు శనివారం ఉదయం ఆదోని ఆర్ట్స్ కాలేజీ పరిధిలో ఉన్న జిమ్(gym)కు వెళ్లాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కళ్లు తిరిగి పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు సపర్యలు చేయగా మెలకువలోకి వచ్చాడు. ఆ క్రమంలో కాసేపటికీ మళ్లీ కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.
ఇటీవల వివాహ వేడుకలో పాల్గొన్న యువకుడు పెళ్లి మండపంలోనే కుప్పకూలిపోయాడు. కాలా పత్తార్ (Kalapattar) పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహ కార్యక్రమానికి రబ్బానీ (Rabbani) అనే వ్యక్తి హాజరయ్యాడు. పెళ్లి కొడుకుతో సరదాగా మాట్లాడుతున్న సమయంలోనే కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. వరుసగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటుండడం అందరినీ కలచి వేస్తోంది. నడి వయస్కులతోపాటు 40 ఏళ్లలోపు వారు కూడా ఆకస్మిక మరణాలు సంభవించడంపై వైద్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారి మృతికి కారణాలు ఏమిటనేవి పరిశీలిస్తున్నారు.
గతేడాది అక్టోబర్ 29వ తేదీన కన్నడ సూపర్ స్టార్ (Kannada Super Star) పునీత్ రాజ్ కుమార్ (46) (Puneeth Raj Kumar) ఈ విధంగానే హఠాన్మరణం చెందారు. తన ఇంట్లోనే జిమ్ లో కసరత్తులు చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. నాటి నుంచి ఇలాంటి సంఘటనలు దేశంలో చాలా చోట్ల చోటుచేసుకుంటున్నాయి.
రోజురోజుకు గుండెపోటు(heart attack)తో మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. గతంలో ఎక్కువగా స్థూలకాయం ఉన్న వారు, వయసు పైబడిన వారికి హార్ట్ ఎటాక్ ఎక్కువగా వచ్చేది. కానీ ప్రస్తుతం 40 ఏళ్ల లోపు యువకులే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్(secunderabad) లోని ఓ జిమ్ లో విశాల్ అనే కానిస్టేబుల్(constable) వ్యాయామం చేస్తుండగా కూప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రి(hospital)కి తరలించారు. కానీ అప్పటికే విశాల్ మృతి చెందినట్లు వైద్యులు(doctors) ప్రకటించారు.