SRD: వాటర్ ట్యాంకులో ప్రమాదవశాత్తు ఓ బాలుడు పడి మృతి చెందిన ఘటన కంగ్టి మండలం సర్దార్ తండాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. తాండకు చెందిన రకియా సంతోష్ దంపతుల ఐదేళ్ల బాలుడు శ్యాంసుందర్ సోమవారం సాయంత్రం బడి వదలగానే ఆడుకుంటూ వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి, పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్యాంకులో పడి మృతి చెందాడు.