HYD: చేవెళ్ల మండలం ఆలూర్ స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. లారీ అదుపుతప్పి దూసుకెళ్లడంతో కూరగాయలు అమ్మే వాళ్ళు చనిపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడినా వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.