KDP: కలసపాడు మండలం ఎగువ రామాపురం గ్రామానికి చెందిన నాలి శ్రీను (28) అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. బతుకుదెరువు కోసం రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంకు వెళ్లాడు. అక్కడ టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కొడంగల్ వద్ద తాను నడుపుతున్న టిప్పర్ ఆపి దిగుతుండగా మరో టిప్పర్ వచ్చి ఢీకొనడంతో మృతి చెందాడు.