SKLM: చర్లపల్లి డివిజన్ చిన్న చర్లపల్లికి చెందిన శంకర్ రావు అప్పుల భారంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బుధవారం స్థానికులు వివరించారు. గత కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం చర్లపల్లికి వలస వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు వివరించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.