కామారెడ్డి: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహబూబ్ ఆదివారం రాత్రి మద్యం కోసం తండ్రి హైమద్(65)ను డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో గొంతు నులిమి చంపేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.