MDCL: జాతీయ రహదారిపై గల కండ్లకోయ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు ఢీకొని కీర్తన(20) అనే ప్రైవేట్ ఉద్యోగిని అక్కడికక్కడే మృతి చెందింది. బస్సు తగలడంతో బైక్ వెనుక ఉన్న కీర్తన కిందపడటంతో, ఆమె తలపై నుంచి బస్సు టైర్లు వెళ్లాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.