అన్నమయ్య: మైసూరు వారిపల్లి సమీపంలో కడప-రేణిగుంట జాతీయ రహదారిపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బైక్పై వెళ్తున్న ఇద్దరు, ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.