TG: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోక్సో చట్టం కింద కేేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.