TG: హైదరాబాద్ ఉప్పరపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు. డీసీఎం ఢీకొని అబ్దుల్ సత్తార్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రాణాలు కొల్పోయాడు. అయినా డీసీఎం ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రోడ్డు ప్రమాద ఘటనపై సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.