RR: అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ పామెన భీమ్ భరత్ అన్నారు. షాబాద్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన పలువురు భీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లోకి చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులవుతున్నారన్నారు.