MNCL: జైపూర్ మండలం నర్వ గ్రామ సమీపంలో శ్రీరాంపూర్2లోని ఓ పబ్లిక్ స్కూల్ టాటా ఎస్ వ్యాన్ బోల్తా పడింది. 23 మంది విద్యార్థులలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ సెల్ ఫోన్లో మాట్లాడుతూ.. అజాగ్రత్తగా నడపడంతో ప్రమాదం జరిగిందని విద్యార్థులు తెలిపారు. గాయపడినవారిని మెడిలైఫ్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.