ADB: తలమడుగు మండలం దహెగాంలో అత్తగారి ఊర్లో నివాసం ఉంటున్న మహారాష్ట్రకు చెందిన ఆకాష్ కుమార్తె అదృశ్యమైనట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 13న భార్యాభర్తలు కూలీ పనులకు వెళ్లగా వారి కూతురు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో, వారి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.