VZM: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రామభద్రపురంలో జరిగింది. స్దానిక పోలీసుల వివరాల ప్రకారం మండలంలోని దిగువ హరిజనపేటకు చెందిన రేజేటి మురళి (50) కూలి TBR థియేటర్ పక్కనున్న పొలంలోకి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని బాడంగి CHCకి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.