ATP: రాప్తాడులో గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు చిన్న ఉజ్జనప్ప కుటుంబం బుధవారం పొలం పనులకు వెళ్లిన సమయంలో దొంగలు కిటికీ ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ శ్రీహర్ష కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.